reduce
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, విశేషణం, తగ్గించుట, తక్కువ చేసుట, మట్టుపరచుట, అణచుట, స్వాధీనముచేసుకొనుట.
- he reduced the strength of the spirit with water సారాయిలో నీళ్ళను కలిపి దాని కారమును మట్టు చేసినాడు.
- he reduced the size of the bag ఆ సంచిని కురచచేసినాడు.
- he reduced their pay వాండ్ల జీతమును తక్కువ చేసినాడు.
- to reduce a fortకోటను పట్టుట.
- he reduced the tree to a log by cutting off the branches ఆ చెట్టు కొమ్మలను నరికి వొక మొద్దుగా చేసినాడు.
- he reduced the sugar to a liquid ఆ బెల్లమును నీళ్ళు చేసినాడు.
- he reduced the pearls to powder ముత్యాలను చూర్ణముచేసినాడు.
- they reduced the house to ruins ఆ యింటిని పాడు చేసినారు.
- they reduced it to nothing దాన్ని సున్న చేసినారు, నూత కలిపినారు.
- he reduced them to obedienceవాండ్లను అణచినాడు; సాధించినాడు, లోపరచుకొన్నాడు.
- he reduced them to povertyవాండ్లను బీదలనుగా చేసినాడు.
- he reduced me to a servant నన్ను వొక బంటుగాచేసినాడు.
- they reduced it to method దాన్ని దారికి తెచ్చినారు, క్రమపరచినారు.
- he reduced these words to rule ఈ శబ్దములకు సూత్ర మేర్పరచినాడు.
- he reduced these trees into classes ఈ చెట్లను జాతివారిగా యేర్పరచినాడు.
- he reduced the pagodas to rupees వరహాలను రూపాయలు చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).