భోజనము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- భోజనము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భోజనము అంటే అనేక పదార్ధములు కలిగిన సంపూర్ణ ఆహారము./అన్నము
అష్టభోగములలో ఒకటి. అష్టభోగములు = 1.. ధనము. 2. ధాన్యము. 3. వాహనములు. 4. భోజనము. 5. వస్త్రము. 6. వసతి. 7. స్నానము. 8. సయోగము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదాలు
- అంధస్సు, అన్నము, అభ్యవహరణము, అభ్యవహారము, ఆరగింత, ఆరో(గ)(గి)ణము, ఆశము, ఓగిరము, ఓదనము, ఓమటి, ఓరెము, ఓవిరము, కడి, కబళము, కశిపువు, కుడుపు, కూడు, కూరము, గడోలము, గర్భము, గారిత్రము, గుడేరము, జేమనము, జగ్ధి, దీదివి, దోమటి, ధాకము, నిఘసము, నేమము, పబ్బము, పరిత్రము, పసదనము, పసాదము, పసాపాటు, పాజము, పార్వతి, పితువు, ప్రేతి, బుత్తి, బువ్వ, బువ్వుము, బోనము, భక్తము, భరణము, భిక్ష, భిస్స, భుక్తి, భుజ్యువు, మెతుకు, రసనము, రాధస్సు, లేపనము, లేపము, లేహము, వాజజము, విందు, విఘనము, సత్కారము, సాదము, సాపాటు, సూనృత, సొజ్జె.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాల వారి విందు అహ అహా నాకె ముందు.
- భోజనముల తర్వాత ఎంగిలితీసి శుద్ధిపెట్టు