వికీపీడియా:విస్పష్టమైన చెత్త
స్వరూపం
సాధారణంగా వికీపీడియన్లు ఎంతో ప్రయోజనకరమైన రచనలను అందిస్తూండగా, కొందరు చెత్తకూడా పోసేస్తూంటారు. ఈ విస్పష్టమైన చెత్తను రెండు వర్గాలుగా చెయ్యవచ్చు:
- కల్తీలేని చెత్త: అంటే ఏవో కొన్ని అక్షరాల పరస్పర సంబంధం లేని, ఒక అర్థం పర్థం లేని కలయిక. హ్ద్గ్స్త్షక్పెద్త్గిఉజ్క్ఫిల్గొగ్ - ఇలా అన్నమాట. కీబోర్డు లోని కీలను ఎడాపెడా కొట్టుకుంటూ పోతే వచ్చే పాఠ్యం అన్నమాట.
- రెండోది, అర్థం పర్థం లేని మాటల కలయిక. చూట్టానికి ఇదేదో గంభీరమైన, తెలివైన పాఠ్యం లాగే కనిపిస్తుంది. ఏదో గొప్ప అర్థాన్ని చెప్పేందుకే రాసారనిపిస్తుంది. తీరా చదివాక ఏమీ అర్థం కాదు, ఉత్త చెత్త. ఆ పాఠ్యాన్ని సవరించి ఒక దారికి తెచ్చి, ఒక అర్థాన్ని కల్పించడం దాదాపు అసంభవం.
ఇతర రకాల చెత్తతో తికమక పడరాదు...
[మార్చు]కింది వాటిని విస్పష్టమైన చెత్తగా భావించరాదు. వీటిలో కొన్ని త్వరిత తొలగింతకు అర్హమైనవే -కానీ వేరే కారణాల వలన, విస్పష్టమైన చెత్త అని కాదు. వీటితో ఎలా వ్యవహరించాలో వికీపీడియా:తొలగింపు విధానం వివరిస్తుంది.
- కాపీహక్కుల ఉల్లంఘన లేదా ఎత్తిపోతల (ప్లేజరిజమ్): అది చెత్త అయినా కాకపోయినా సరే, వెంటనే తొలగించెయ్యాలి.
- అసత్యాలు, అప్రతిష్ఠ, పరువునష్టం కలిగించేవి, అపవాదులు వేసే వ్యాఖ్యలు. సరైన మూలాలుంటే తప్ప, వాటిని వెంటనే తొలగించాలి. వీలైతే, నిర్వాహకులు సదరు కూర్పును పూర్తిగా తొలగించాలి. వికీపీడియా:జీవించి ఉన్నవారి చరిత్రలు చూడండి
- భాషాదోషభూయిష్టంగా, పేలవంగా ఉన్న రచనలు.
- లింకుల్లేని పాఠ్యం. దానికి {{Underlinked}} ట్యాగును తగిలించవచ్చేమో చూడండి.
- ఇంగ్లీషులో ఉన్న పాఠ్యం. అనువాదం కోరబడిన పేజీలు చూడండి
- దుశ్చర్యలు: తలాతోకా లేని, అసందర్భమైన, అసంబద్ధమైన, పరిణతి లేని రాతలు. ఇది విస్పష్టమైన చెత్త కాకపోవచ్చుగానీ, దానితో సమానంగానే చూడాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఆ చెత్త సరిగా రాయడం చేతకాకపోవడం వలన చేరి ఉండవచ్చు, వాడుకరి కావాలని చెత్త పోసి ఉండకపోవచ్చు. దాన్ని గమనించాలి.
విస్పష్టమైన చెత్తతో వ్యవహరించడం
[మార్చు]విస్పష్టమైన చెత్తతో వ్యవహరించడానికి అనేక పద్ధతులున్నాయి. ఆయా సందర్భాలకు ఏది తగునో మీరు నిర్ణయించండి:
- దాని స్థానంలో బాగా రాసిన వ్యాసం పెట్టండి.
- ఆ వ్యాసాన్ని దాని చర్చాపేజీకి తరలించండి.
- ఆ వ్యాసాన్ని వాడుకరి చర్చాపేజీకి తరలించండి.
- చెత్తను తొలగించాక వ్యాసంలో పనికొచ్చే పాఠ్యం ఉంటుందనుకుంటే ఆ చెత్తను తొలగించండి. విస్పష్టమైన చెత్తను తొలగించడం సాధారణంగా సులువుగానే ఉంటుంది.
- కొత్త వాడుకరి చేసిన ప్రయోగం కావచ్చునేమో చూడండి. అలా అయితే, కొత్తవాళ్ళను బెదరగొట్టకండి, వాళ్ళను హెచ్చరించండి. హెచ్చరించడానికి uw-test శ్రేణి మూసలున్నాయి పరిశీలించండి. ఆ మూసలను వాడుతూ, వాడుకరులను హెచ్చరిస్తూ, దుశ్చర్యలను కొనసాగిస్తున్న వాడుకరులను దుశ్చరితులుగా ప్రకటించండి.
- అయితే, వాడుకరి తాను చేస్తున్నది సరైనదే అని సమర్ధించుకుంటూ, మీ చర్యలకు అభ్యంతరం చెబితే, వారితో చర్చించి ఒక ఏకాభిప్రాయానికి రండి. ఈ చెత్తను సరిదిద్ది పనికొచ్చేలా తయారుచేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే అందుగ్గాను వారికి తగినంత సమయం ఇవ్వండి.
ఏదైనా పేజీలో విస్పష్టమైన చెత్త తప్ప మరేమీ లేకపోతే:
- ముందుగా, పేజీ చరితాన్ని పరిశీలించండి. ఇప్పుడున్న ఈ చెత్త గతంలోని మంచి పాఠ్యాన్ని తీసేసి పెట్టారేమో చూడండి. అలా అయితే, దానికి ముందున్న కూర్పుకు పేజీని పునస్థాపించండి. అలా చేసిన వాడుకరిని హెచ్చరించండి.
- లేదంటే {{db-g1}} లేదా {{db-nonsense}} వంటి మూసలను పెట్టి పేజీ త్వరిత తొలగింపుకు నోటిసు ఇవ్వండి. బాధ్యులైన వాడుకరిని హెచ్చరిక మూసల ద్వారా హెచ్చరించండి.
ఇవి కూడా చూడండి
[మార్చు]- Buffalo buffalo Buffalo buffalo buffalo buffalo Buffalo buffalo, another example
- The Sokal hoax (article), nonsense that made it to Social Text
- Word salad
- Wikipedia:Complete bollocks
- తొలగింపు విధానం
- Wikipedia:Policies and guidelines