Directory

గింప్ - వికీపీడియా Jump to content

గింప్

వికీపీడియా నుండి
GIMP
Wilber, The GIMP mascot

గింప్ 2.6 యొక్క తెరపట్టు
అభివృద్ధిచేసినవారు గింప్ అభివృద్ధి బృందం
మొదటి విడుదల 1996
సరికొత్త విడుదల 2.6.10 / 8 జూలై 2010 (2010-07-08)
మునుజూపు విడుదల 2.7.1 / 29 జూన్ 2010 (2010-06-29)
ప్రోగ్రామింగ్ భాష C , GTK+
నిర్వహణ వ్యవస్థ లినక్సు, మాక్ OS X, మైక్రోసాఫ్ట్ విండోస్, FreeBSD, సొలారిస్
భాషల లభ్యత గింప్ 2.6 విడుదల 52 భాషలలో లభిస్తున్నది, 37 పూర్తిగా అనువాదితం, మిగతావి పాక్షికముగా అయినవి.
ఆభివృద్ది దశ క్రియాత్మకం
రకము రాస్టర్ గ్రాఫిక్స్ ఎడిటర్
లైసెన్సు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్
వెబ్‌సైట్ గింప్

"గింప్" (GIMP) అనేది ఒక ఒపెన్ సొర్స్ (ఉచితం) రాస్టర్ గ్రాఫిక్స్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్టువేరు.

గింప్ గురించి

[మార్చు]

ఛాయాచిత్రాలని ( ఫోటోలు ), బొమ్మల్ని మార్పులు చేర్పులు (ఎడిటింగ్) చేసుకొనేందుకు ఎటువంటి నకలుహక్కుల బాదరబంది (GNU) లేని ఉచిత మృదులాంతకం (సాఫ్టువేరు).


గ్నూ ఇమేజ్ మానిప్యులేషన్ ప్రోగ్రామ్‌కి సంక్షిప్త నామమే గింప్. రాస్టర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ (Raster Graphics Editing) కి ప్రామాణికమయిన ఫోటోషాప్ (Photoshop family ఛత్రం క్రింద వాణిజ్యపరంగా $99 నుండి $999 మధ్య ఖరీదుకి లభిస్తుంది) కి మారుగా ఉచితంగా లభిస్తున్న ఈ గింప్ సాఫ్టువేరుతో బొమ్మల్ని సంకలనం చేసుకోవచ్చు.


ప్రధానంగా గింప్ గ్రాఫిక్స్,చిహ్నాలు తయారీకి,బొమ్మల్ని కావలసిన కొలతలకి మార్పు చేయడానికి, వివిధ ఫార్మాట్లలో ఉన్న బొమ్మల్ని కావలసిన ఫార్మాట్‌కి మార్చడానికి, బొమ్మలో ఉన్న రంగుల మార్పుకు, వివిధ ఫోటోలలోని భాగాలతో కొత్త బొమ్మల సృష్టించుటకు, కావలసిన కొలతలతో,ఫార్మేట్లలో ముద్రించుకోడానికి, గిఫ్ (Gif) ఫార్మాట్లో యానిమేషన్ వంటివి సులభంగా రూపొందించుటకు ఉపకరిస్తుంది.


గింప్ చరిత్ర

[మార్చు]

గింప్ పరియోజనను 1995 లో స్పెన్సర్ కింబాల్ (Spencer Kimball and Peter Mattis), పీటర్ మాట్టిస్ (Peter Mattis) అనే ఇద్దరు తయారుచేసి గ్నూ క్రింద అందరికి అందుబాటులో ఉండే విధంగా ఉంచారు. ఇప్పుడు వీరితోపాటు 2987 మంది పయిచిలుకు ఔత్సాహికులు గింప్ సాఫ్టువేరుని ఆధునీకరిస్తున్నారు.

ఇప్పుడు అందుబాటులో ఉన్న రూపాంతరం 2.2.4 ని జనవరి,2008 న విడుదల చేసారు.

ఉపకరణాలు,విశిష్టతలు,విశేషాలు

[మార్చు]
గింప్ కుంచెలు

గింప్ ఉపయోగించడానికి అవసరమయ్యే ఉపకరణాలు (tools) పరికరాల పెట్టె ద్వారాను, పట్టిక ద్వారాను, సంభాషణల పెట్టె ద్వారాను వినియోగించుకోవచ్చు. ఇవి వివిధ చట్రాలుగా కూడా గుంపు చేసుకోవచ్చు. వీటిలో వడబోతలు (filters), కుంచెలు (brushes), మార్పిడి చేయు (transformation), ఎంపిక (selection), పొరలు (layer) గా మార్చు, ముసుగు (masking) పరచు పరికరాలు కొన్ని.

ఉదాహరణకు గింప్‌లో 48 రకాలుగా ప్రామాణిక కుంచెలు ఉన్నా కూడా కొత్త వాటిని కూడా అవసరానికి తగ్గట్టుగా తయారు చేసుకోవచ్చు. ఈ కుంచెలను గట్టి రకాలుగాను, మృదువైన కొనల వాటిగాను, తుడిపివేసేవిగాను ఉపయోగించడమే కాక రకరకాల పారదర్శకతలతో, రకరకాల రీతులతో (modes) చిత్రీకరణకు ఉపయోగించవచ్చు.

రంగుల ఉపయోగం

[మార్చు]

గింప్‌లో రంగులను RGB, HSV, CMYK, రంగుల చక్రం (color wheel), రంగులను స్వంతంగా కలుపుకోవడం ద్వారా ఉపయోగించవచ్చు. అంతే కాక రంగులను బొమ్మనుండే పట్ట (pick) వచ్చు. దీనిలో షోడశాంశ (hexadecimal) రంగు సంకేతాలు (codes) కూడా ఉపయోగించవచ్చు. (వీటిని HTMLలో ఉపయోగిస్తారు). 'CMYK' రంగులు వెంటనే RGB విధానంలోకి మారిపోతాయి). RGBలో వాడలేనటువంటి, కేవలం CMYK విధానంలో మాత్రమే వాడే రంగులను గింప్ సపోర్టు చేయదు. ఉదా: చిక్కటి నలుపు. కానీ వాటిని కొన్ని అన్యజనిత (third-party) పరికరాల ద్వారా కొంతవరకు సాధించ వచ్చు.

గింప్‌లో వాలులని కూడా ఉపయోగించవచ్చు. కుంచెలు, ఇతర ఉపకరణాలతో వీటిని చక్కగా అనుసంధానించవచ్చు. దీనిలో రకరకాలైన సహనిర్మితమైన (built-in) gradients ఉన్నాయి. అంతేకాక వాడుకరి (user) కూడా వీటిని అవసరానుగుణంగా (customize) చేసుకోవచ్చు.

గింప్ పొరలు,ఛానళ్ళు,పథాల గురించిన చిత్రచాలనం

బొమ్మను ఎన్నుకొను , ముసుగు పరచు పరికరాలు

[మార్చు]

యానిమేషన్ మెనూలో మూడు విధాలయిన సంభాషణ చట్రాలుంటాయి. అవి పొరలు (layers), ఛానల్సు, పథాలు (paths). గింప్‌తో గుండ్రపు, చదరపు, చేతి గీత వాటం, రంగు ద్వారా కూడా బొమ్మను ఎన్నుకోవచ్చు. అంతే కాక "మ్యాజిక్ వాండ్" అని పిలువబడే తెలివైన ఎంపిక పరికరం (Smart Selection tool) తో కలపడి ఉన్న ప్రదేశాలను కూడా ఎన్నుకోవచ్చు. తెలివైన కత్తెర (iScissors) పరికరం ద్వారా రంగు భేదం కలిగిన ప్రదేశాలను కలుపుతూ ఎన్నిక కొరకు మార్గాలను గీసుకోవచ్చు. గింప్ పొరల ద్వారా బొమ్మను పూర్తిగా చూపవచ్చు, మసకగా చూపవచ్చు, అసలు కనపడకుండా చేయవచ్చు.

ప్రభావాలు, స్క్రిప్టులు వడబోతలు

[మార్చు]

గింప్‌తో బాటు 150 రకాలైన ప్రభావాలు, వడపోతకాలు సాధారణంగా లభిస్తాయి. వాటిలో నీడను పడవేయు, మసక, చలన మసక, Noise కూడా ఉన్నాయి.

సమాచారం

[మార్చు]

వనరులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గింప్&oldid=3430286" నుండి వెలికితీశారు