Directory

ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ - వికీపీడియా Jump to content

ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్

వికీపీడియా నుండి
ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్

ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ (2 వ తరగతి, సైనిక విభాగం) (పైన)
రిబ్బను (కీంద)
Awarded by బ్రిటిషు రాచరికం
Typeసైనిక పురస్కారం
Established1837
Eligibilityసైన్యం లోని భారతీయులు, పౌరులు (పౌర విభాగం)
Awarded forధైర్య సాహసాలు
Status1947 లో నిలిపివేసారు
Post-nominalsIOM
Precedence
Next (higher)విక్టోరియా క్రాస్
ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్, మొదటి రెండవ, మూడవ తరగతులు

ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ( IOM ) అనేది బ్రిటిష్ భారతదేశంలో సైనిక, పౌర పురస్కారం. దీన్ని 1837 లో నెలకొల్పారు. (జనరల్ ఆర్డర్ ఆఫ్ ది గవర్నర్-జనరల్ ఆఫ్ ఇండియా, నం. 94, 1837 మే 1) [1] 1947 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దీన్ని నిలిపివేసారు. 1954 లో ప్రత్యేక భారతీయ పురస్కారాలను నెలకొల్పారు. సుదీర్ఘకాలం పాటు IOM అనేది బ్రిటిష్ భారతీయ సైన్యానికి చెందిన భారతీయులు అందుకున్న అత్యున్నత పురస్కారం. మొదట్లో దీనికి మూడు విభాగాలు ఉండేవి. 1911 లో విక్టోరియా క్రాస్ కోసం భారతీయ సైనికులు అర్హత పొందినప్పుడు దీన్ని మార్చారు. IOM యొక్క 1902 - 1939 మధ్య ఒక పౌర పురస్కారం కూడా ఇందులో ఉండేది. అయితే, దాన్ని చాలా అరుదుగా మాత్రమే ప్రదానం చేసేవారు.

చరిత్ర

[మార్చు]

ఈ పతకాన్ని మొదట ఈస్ట్ ఇండియా కంపెనీ 1837 లో "ఆర్డర్ ఆఫ్ మెరిట్" పేరుతో ప్రవేశపెట్టింది. 1857 లో భారత తిరుగుబాటు తరువాత 1858 లో బ్ర్టిషు రాచరికం స్వాధీనం చేసుకుంది. బ్రిటిష్ ఆర్డర్‌కూ అదే పేరు ఉండేది. ఈ రెండింటి మధ్య ఉన్న గందరగోళాన్ని నివారించడానికి 1902 లో పతకం పేరును మార్చారు. [2] 1911 లో భారతీయ విశిష్ట సేవా పతకాన్ని ప్రవేశపెట్టక ముందు వరకూ - 1837 - 1907 మధ్య - స్థానిక సైనికులకు లభించిన ఏకైక శౌర్య పతకం ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ మాత్రమే. 1911 నుండి స్థానిక సైనికులకు విక్టోరియా క్రాస్ కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు ఆర్డర్ లోని రెండు విభాగాలనూ తొలగించారు. ఈ పురస్కార గ్రహీతలు తమ పేరు తరువాత IOM అని పెట్టుకునేవారు.

ఈ పురస్కార లక్ష్యం "వ్యక్తిగత సేవా కాలం, మంచి ప్రవర్తనలకు సంబంధం లేకుండా, కేవలం వ్యక్తిగత శౌర్య ప్రదర్శనకే వ్యక్తిగత బహుమతి ఇవ్వడం" [3]

పతకం

[మార్చు]

సైనిక విభాగం

[మార్చు]

ఈ పతకం మొదట మూడు తరగతులతో (మొదటి, రెండవ, మూడవ తరగతులు) ప్రవేశపెట్టారు. భారత సైనికులకు ఇతర పతకాలు అందుబాటులో వచ్చిన తరువాత, దాన్ని రెండు తరగతులకు తగ్గించారు ( మొదటి తరగతి స్థానంలో విక్టోరియా క్రాస్ వచ్చింది). 1944 లో దీన్ని ఒకే తరగతికి తగ్గించారు. సాధారణంగా ఒక ఉన్నత తరగతి పురస్కారం ప్రదానం చేసే ముందు గ్రహీతకు దిగువ తరగతి పురస్కారం పొంది ఉండాలనే నిబంధన ఉండేది. అయితే గ్రహీతలు ఒకటి కంటే ఎక్కువ శౌర్య చర్యలను ప్రదర్శించిన సందర్భాల్లో వారికి, గతంలో దిగువ తరగతి పురస్కారం లేకపోయినా, నేరుగా ఉన్నత తరగతి పురస్కారం ఇచ్చేవారు. ఆర్డర్ గ్రహీతలకు వేతనం పెరిగేది, పింఛను, అలవెన్సులు పెరిగేవి. చాలా అమ్ంచి గౌరవం లభించేది. [4]

పౌర విభాగం

[మార్చు]

1902 - 1939 మధ్య రెండు తరగతులలో పౌర పురస్కారం కూడా అందుబాటులో ఉండేది. తర్వాత దాన్ని ఒకటే తరగతికి తగ్గించారు. పౌర పతకం అరుదుగా ప్రదానం చేయబడింది.

వివరణ

[మార్చు]

మూడవ తరగతి

[మార్చు]

నీలిరంగు వృత్తంతో ఎనిమిది కోణాలు కలిగి మెరుపు లేకుండా ఉండే వెండి నక్షత్రం, వెండి లారెల్స్‌తో, మధ్యలో, ఐమూలల్లో ఒకదానికొకటి అడ్డంగా అమర్చిన రెండు కత్తులు, "ఎవార్డెడ్ ఫర్ వేలర్" (శౌర్యపురస్కారం) అనే పదాలు ఉంటాయి. 1944 లో ఈ పదాలను "ఎవార్డెడ్ ఫర్ గాలంట్రీ" (సాహస పురస్కారం) అని మార్చారు.

యుద్ధక్షేత్రంలో గానీ దాడిలో గానీ దుర్గ రక్షణలో గానీ వ్యక్తిగత ధైర్య సాహసాలను చూపొఇన స్థానిక అధికారులు లేదా సైనికులకు - ర్యాంకు లేదా గ్రేడు అంతరమేమీ లేకుండా - దీన్ని ఇచ్చేవారు. [5]

రెండవ తరగతి

[మార్చు]

నీలిరంగు వృత్తంతో ఎనిమిది కోణాల్లో మెరిసే వెండి నక్షత్రం, చుట్టూ బంగారు లారెల్స్, ఐమూలగా అమర్చిన రెండు కత్తులతో, "ఎవార్డెడ్ ఫర్ వేలర్" (శౌర్యపురస్కారం) అనే పదాలు ఉంటాయి. 1944 లో ఈ పదాలను "ఎవార్డెడ్ ఫర్ గాలంట్రీ" (సాహస పురస్కారం) అని మార్చారు.

ఇప్పటికే మూడవ తరగతి పతకం లేదా తత్సమానమైన పురస్కారం ఉన్నవారు దీనికి అర్హులు. [6]

మొదటి తరగతి

[మార్చు]

నీలిరంగు వృత్తంతో ఎనిమిది కోణాల బంగారు నక్షత్రం, మధ్యలో బంగారు లారెల్స్, ఐమూలగ అమరచిన కత్తులతో "ఎవార్డెడ్ ఫర్ వేలర్" (శౌర్యపురస్కారం) అనే పదాలు ఉంటాయి. 1944 లో ఈ పదాలను "ఎవార్డెడ్ ఫర్ గాలంట్రీ" (సాహస పురస్కారం) అని మార్చారు.

మూడవ, రెండవ తరగతుల పురస్కారాలు పొందిన వారు మాత్రమే దీనికి అర్హులు. [7]

రిబ్బను

[మార్చు]

ముదురు నీలపు రిబ్బనుకు రెండువైపులా దాని వెడల్పులో ఆరవ వంతు వెడల్పున్న రెండు ఎర్రటి చారలతో ఉంటుంది. [8]

ప్రముఖ గ్రహీతలు

[మార్చు]
  • IOM యొక్క మొదటి గ్రహీత బెంగాల్ సాపర్స్‌కు చెందిన సబ్ దేవి సింగ్, 12 సప్పర్‌లతో పాటు 23 జూలై 1839 న ఆఫ్ఘనిస్తాన్‌లోని గజనీ కోట యొక్క అజేయమైన ద్వారాలను కూల్చివేశారు.
  • సుబేదార్ మీర్ దస్త్ V.C., IOM
  • మేజర్ P. I.O.M.,I.D.S.M.,P.V.S.M.,Y.S.M.,M.S.M.
  • సుబేదార్ కిషన్‌బీర్ నాగరకోటి, IOM 1/5 GR (FF) నాలుగు సార్లు IOM అవార్డు పొందిన ఏకైక వ్యక్తి. అందుకే గుర్తింపుగా గోల్డ్ క్లాస్‌ప్ అందించారు.
  • G.C.I.E. బహదూర్ సర్ బిజయ్ చంద్ మహతాబ్ G.C.I.E., KCSI, IOM
  • మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్‌లో శత్రు దళాలను వెనక్కి నెట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన సోవర్ AL దఫాదర్ ఉదయ్ సింగ్, 1726 కు ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లభించింది. [9]
  • 1897 లో సారాఘర్హి యుద్ధంలో అధిక సంఖ్యలో పోరాడిన 36 వ సిక్కుల బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి చెందిన 21 మంది సైనికులు [10]
  • హవల్దార్ కర్బీర్ పన్, జాన్ డంకన్ గ్రాంట్ తో పాటు చేసిన చర్యలకు గాను IOM లభించింది. గ్రాంట్‌కు విక్టోరియా క్రాస్ లభించింది. 1904 జూలై 6 బ్రిటిష్ కల్నల్ యుంగ్‌హస్బెండ్‌తో కలిసి టిబెట్ మీద చేసిన దాడిలో [11]
  • హవిల్దార్ నూర్ ఖాన్, IOM, IDSM, Regt No-13535, 3/2 పంజాబ్ రెజిమెంట్, టోబిక్, లిబియాలోని నాజీ POW క్యాంప్ నుండి ప్రణాళిక, అమలు, తప్పించుకునే ప్రణాళిక కోసం [1] Archived 2021-05-17 at the Wayback Machine [12]
  • సుబాదార్-మేజర్, గౌరవ. కెప్టెన్ [13] బిసేసర్ (ప్రత్యామ్నాయంగా బిస్సేసర్ [14] ) తివారి, సర్దార్ బహదూర్, 1909 నుండి 1914 వరకు 1 వ బ్రాహ్మణ రెజిమెంట్ యొక్క సీనియర్ భారతీయ అధికారి. 1886 లో సిపాయి (ప్రైవేట్) గా, అతనికి 3 వ బర్మా యుద్ధంలో (1885) ధైర్యసాహసాల కోసం 2 వ తరగతి ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ (IOM) లభించింది: 'మెడపై తీవ్ర గాయంతో బాధపడుతూ కూడా శత్రువు స్థానంపై దాడి చేయడం, రోజంతా దాడి చేస్తూనే ఉండడం' [14]
  • సుబేదార్ మేజర్ (గౌరవ. కెప్టెన్ ) సర్దార్ బహదూర్ ముహమ్మద్ ఇస్మాయిల్, IOM 2 వ తరగతి 1897, OBI 2 వ తరగతి 1909, OBI 1 వ తరగతి 1917 - 32 వ పర్వత బ్యాటరీ బ్రిటిష్ ఇండియా ఆర్మీ [15]
  • ఉప మేజర్ & గౌరవ. కెప్టెన్ రితు సింగ్ రావత్, IOM, IDSM, MD, 3 వ బెటాలియన్ 18 వ రాయల్ గర్హ్వాల్ రైఫిల్స్, మధ్యప్రాచ్యంలో శౌర్య చర్యల కోసం, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, మే 3, 1941 న భారతదేశం గెజిట్ నం. 113- [16]
  • సర్దార్ బహదూర్ అర్జన్ సింగ్ భుల్లార్, IOM, OBI, 1 వ పంజాబ్ సిక్కు రెజిమెంట్ [17]

మూలాలు

[మార్చు]

 

  1. "Calcutta Monthly Journal and General Register 1837". p. 60.
  2. "Indian Order of Merit Badge of the 1st Class Military Division, 1837-1912". National Army Museum. Archived from the original on 4 October 2012. Retrieved 17 September 2015.
  3. "Calcutta Monthly Journal and General Register 1837". p. 60.
  4. "Calcutta Monthly Journal and General Register 1837". p. 60.
  5. "Calcutta Monthly Journal and General Register 1837". p. 60.
  6. "Calcutta Monthly Journal and General Register 1837". p. 60.
  7. "Calcutta Monthly Journal and General Register 1837". p. 60.
  8. "Calcutta Monthly Journal and General Register 1837". p. 60.
  9. https://www.thegazette.co.uk/London/issue/29886/supplement/55/data.pdf
  10. Regimental numbers from photo of Saragarhi memorial plaque
  11. "The London Gazette: Official Public Record "War Office, January 24, 1905"". The London Gazette: Official Public Record. 24 January 1904. Retrieved 13 August 2017. "The KING has been graciously pleased to signify His intention to confer the decoration of the Victoria Cross upon the undermentioned officer, whose claims have been submitted for His Majasty's approval, for his conspicuous bravery in Thibet, as stated against his name...
  12. No.113-H dated 10th July 1941.
  13. "(1019) - Army lists > 1914-1940 - Monthly army lists > 1914-1918 > November 1914 British Military lists". National Library of Scotland (in ఇంగ్లీష్). Retrieved 2017-07-05.
  14. 14.0 14.1 "Online Collection | National Army Museum, London". collection.nam.ac.uk (in ఇంగ్లీష్). Retrieved 2017-07-05.
  15. GGO/L/Mil/17/2-L/Mil/17/5] & The History of Indian Artillery by Brig Gen Graham.
  16. H dated 10th July 1941.
  17. "Page 1815 | Supplement 36477, 18 April 1944 | London Gazette | the Gazette".